గులాబ్‌జామూన్
  • 365 Views

గులాబ్‌జామూన్

కావలసినవి:

  • ఇన్‌స్టంట్ గులాబ్‌జామూన్ పౌడర్ - కప్పు
  • పంచదార - 2 కప్పులు;
  • నీళ్లు - కప్పు
  • నెయ్యి - వేయించడానికి తగినంత
  • ఏలకుల పొడి - చిటికెడు

విధానం:

పిండిలో పాలు పోసి, కలిపి మెత్తని ముద్ద చేయాలి. కొద్ది కొద్దిగా పిండి తీసుకొని, ఉండలు చేయాలి. ఒక గిన్నెలో పంచదార, నీళ్లు కలిపి కరిగించి లేత పాకం పట్టుకోవాలి. అందులో ఏలకుల పొడి వేయాలి.బాణలిలో నెయ్యి పోసి, కాగిన తర్వాత ఈ ఉండలను బంగారువర్ణం వచ్చేవరకు వేయించి, పంచదార పాకంలో వేసి, పదినిమిషాలు మూత పెట్టాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు కప్పులలోకి తీసుకోవాలి.