గుమ్మడి కాయ సూప్‌
  • 664 Views

గుమ్మడి కాయ సూప్‌

కావలసినవి:

  • గుమ్మడికాయ - చిన్నది,
  • ఎరుపు క్యాప్సికమ్‌ - 2,
  • నువ్వుల నూనె - 1 స్పూన్‌
  • ఉల్లిపాయలు - 2,
  • కొబ్బరి పాలు - 2 కప్పులు,
  • ఉప్పు - తగినంత
  • కూరగాయలు/చికెన్‌ ఉడికించిన నీళ్లు - 2 కప్పులు
  • మిరియాల పొడి - రుచికి సరిపడినంత

విధానం:

గుమ్మడికాయ చెక్కుతీసి ముక్కలు కోయాలి. ఉల్లిపాయలు సన్నగా తరగాలి. క్యాప్సికమ్‌ ముక్కలు కోసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. బాండీలో నూనె కాగాక క్యాప్సికమ్‌ ముద్ద, ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. తర్వాత గుమ్మడి ముక్కలు, కొబ్బరి పాలు పోయాలి. గుమ్మడి ముక్కలు మెత్తబడ్డాక స్టౌమీద నుండి దించేయాలి. చల్లారాక ఈ మిశ్రమాన్ని మరోసారి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. మరో గిన్నెలో కూరగాయలు/ చికెన్‌ ఉడికించిన నీళ్లు పోసి అందులో గుమ్మడి ముక్కల మిశ్రమాన్ని వేసి మరిగించాలి. ఇది చిక్కగా ఉడికిందంటే గుమ్మడి సూపు సిద్ధమైనట్లే. ఇందులో మిరియాల పొడి, ఉప్పు చల్లుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. సూపు పల్చగా కావాలనుకునేవారు ఎక్కువ నీళ్లు పోసి మరిగించుకోవాలి.