హలీమ్‌
 • 469 Views

హలీమ్‌

కావలసినవి:

 • గోధుమ రవ్వ : పావు కిలో
 • నెయ్యి : పావు కిలో
 • మటన్‌ (బోన్‌లెస్‌) : పావు కిలో
 • పుట్నాల పప్పు(తినే శెనగ పప్పు) : 50 గ్రాములు
 • గరం మసాలా : ఒక టీ స్పూను
 • తరిగిన ఉల్లిపాయల ముక్కలు : ఒక కప్పు
 • కొత్తిమీర : ఒక కట్ట
 • పుదీనా : ఒక కట్ట
 • నిమ్మకాయలు : రెండు
 • ఉప్పు : తగినంత

విధానం:

రంజాన్‌ నెలలో మనకు ముఖ్యంగా దర్శనమిచ్చే వంటకం హలీమ్‌. రోజా ఉండే ముస్లిం సోదరులకు ఇదో అద్భుతమైన, రుచికరమైన విందు. ఇది ఇంట్లో తయారు చేసుకోవడం కొంచెం కష్టమే అయినా ఎపుడైనా సరదాగా ప్రయత్నించాలనుకుంటే ఇలా చేయండి. ముందుగా మటన్‌ను శుభ్రం చేసుకొని, మందపాటి పాత్రలో ఐదు గంటల పాటు ఉడికించాలి. మటన్‌ బాగా ఉడికిన తర్వాత గోధుమ రవ్వ, పుట్నాల పొడి, గరం మసాల వేసి బాగా కలిపి మరో నాలుగు గంటల పాటు సన్నటి సెగపై (అడుగు అంటకుండా) ఉడికించాలి. బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఈ మిశ్రమానికి నెయ్యి కలిపి అది కరిగే వరకూ ఉంచి దించేయాలి. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేయించుకోవాలి. ఒక ప్లేటులోకి వేడి వేడి హలీమ్‌ను తీసుకొని అందులో వేయించిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన కొత్తమీర, పుదీనా ఆకులు వేసి వాటిపై నిమ్మరసం పిండి వడ్డించాలి.