హైదరాబాదీ ఫిష్ బిర్యానీ
 • 355 Views

హైదరాబాదీ ఫిష్ బిర్యానీ

కావలసినవి:

 • పెరుగు - 50 గ్రా;
 • నిమ్మకాయ - ఒకటి
 • నిమ్మరసం - రెండు టీ స్పూన్లు;
 • ఉల్లిపాయ తరుగు - కప్పు (వేయించినది);
 • నూనె - పావు కప్పు
 • కొత్తిమీర తరుగు - కట్ట;
 • పుదీనా తరుగు - కట్ట;
 • పచ్చిమిర్చి - 10 (నిలువుగా చీరాలి)
 • గరం మసాలా - టీ స్పూన్;
 • కారం - టీ స్పూన్,
 • పసుపు - అర టీ స్పూన్,
 • బాస్మతీ రైస్ - 200 గ్రా
 • కెవ్రా వాటర్ - టీ స్పూన్ (మార్కెట్‌లో దొరుకుతుంది),
 • నెయ్యి - రెండు టీ స్పూన్లు;
 • డాల్డా - రెండు టీ స్పూన్లు,
 • బిర్యానీ ఆకు - రెండు;
 • జాజికాయ పొడి - అర టీ స్పూన్
 • ఏలుకల పొడి - అర టీ స్పూన్;
 • దాల్చిన చెక్క - చిన్న ముక్క;
 • లవంగాలు - నాలుగు
 • రోజ్ వాటర్ - టీ స్పూన్;
 • అల్లం తరుము - రెండు టీ స్పూన్లు;
 • కుంకుమ పువ్వు - చిటికెడు

విధానం:

చేప ముక్కలను శుభ్రంగా కడగాలి. ఒక గిన్నెలో చేప ముక్కలు, పెరుగు, నిమ్మరసం, పసుపు, కారం, గరం మసాలా వేసి అన్నిటినీ కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా బియ్యం కడిగి 30 నిమిషాలపాటు నాననివ్వాలి. బియ్యంలో తగినంత ఉప్పు వేసి పొడిపొడిగా ఉడికించి పక్కన పెట్టాలి. ఇప్పుడు పాన్‌లో నూనె వేసి వేడెక్కాక అందులో ఏలకుల పొడి, లవంగాలు, దాల్చిన చెక్క, జాజికాయ పొడి, బిర్యాని ఆకులు, కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి వేసి అన్నిటినీ దోరగా వేయించాలి. అందులో కప్పు నీళ్లు పోసి నానబెట్టిన చేప ముక్కలు, కాస్త ఉప్పు వేసి తక్కువ సెగ మీద మూత పెట్టి ఉడికించాలి. ఈ మిశ్రమం చిక్కబడ్డాక కుక్కర్‌లో ఉడికిన అన్నం కొంచం, చేప మిశ్రమం కొంచం, డాల్డా, నెయ్యి, కుంకుమపువ్వు, రోజ్ వాటర్, కెవ్రా వాటర్ కొంచెం కొంచెం చొప్పున అన్నిటినీ లేయర్స్‌గా వేసి మూతపెట్టి తిరిగి అయిదారు నిమిషాలు ఉడికించాలి. తినబోయే ముందు సర్వింగ్ బౌల్‌లో బిర్యానీని తీసుకుని వేయించిన ఉల్లిపాయ తరుగు, కొత్తిమీర, నిమ్మచెక్కలతో గార్నిష్ చేయాలి. ఎంతో రుచికరమైన హైదరాబాది ఫిష్ బిర్యానీ రెడీ.