ఐస్‌క్రీం ఫ్రూట్‌పంచ్‌
  • 365 Views

ఐస్‌క్రీం ఫ్రూట్‌పంచ్‌

కావలసినవి:

  • బత్తాయి, ఫైనాఫిల్ జ్యూస్‌లు ఒక కప్పు చొప్పున
  • దానిమ్మ గింజల జ్యూస్.. అర కప్పు
  • వెనీలా ఐస్‌క్రీం.. రెండు కప్పులు
  • చెర్రీపండ్లు.. పది

విధానం:

ఒక చిన్న పాత్రలోకి బత్తాయి, ఫైనాఫిల్, దానిమ్మ గింజల జ్యూస్‌లను తీసుకుని బాగా కలియబెట్టాలి. ఇప్పుడు మూడు జ్యూస్ గ్లాసులను తీసుకుని వాటిలో రెండు టీస్పూన్ల చొప్పున వెనీలా ఐస్‌క్రీం వేయాలి. తరువాత ఆ గ్లాసులను పండ్ల రసంతో నింపాలి. ఇప్పుడు పైన ఒక్కో గ్లాసులో మూడు చొప్పున చెర్రీపండ్లను పైన అలంకరిస్తే ఫ్రూట్‌పంచ్ సిద్ధమైనట్లే..! దీన్ని అలాగే అయినా సరే, లేదా కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి అయినా సరే.. చల్ల చల్లగా సర్వ్ చేస్తే సరి..!!