ఇడియాప్పం
  • 269 Views

ఇడియాప్పం

కావలసినవి:

  • వేయించిన బియ్యప్పిండి- ఒకటిన్నర కప్పు,
  • వేడి నీళ్ళు-ఒకటిన్నర కప్పు,
  • కొబ్బరి తురుము-ముప్పావు కప్పు,
  • ఉప్పు-తగినంత

విధానం:

ఓ గిన్నెలో బియ్యప్పిండి తీసుకుని ఉప్పు వేసి బాగా కలపాలి. తరువాత వేడి నీళ్ళు పోసుకుంటూ పిండిలా కలపాలి. అవసరాన్ని బట్టి నీళ్ళు పోసుకుంటూ గట్టి పిండి అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీనిపైన తడిబట్టని కప్పి కాసేపు నాననివ్వాలి.అరగంట అయ్యాక ఇడ్లీ ప్లేట్లను తీసుకుని నూనె లేదా నెయ్యి రాసి అందులో కొద్దిగా కొబ్బరి తురుము వేయాలి. ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని జంతికల గొట్టంలోకి తీసుకుని ఇడ్లీప్లేట్లలో జంతికలు వచ్చేలా వత్తాలి. ఇప్పుడు వీటిని ఆవిరి మీద ఏడు నుంచి తొమ్మిది నిమిషాల వరకూ ఉడికించి దింపేయాలి. వేడి కొద్దిగా చల్లారాక చెంచాతో తీసేస్తే ఇడియాప్పం ఇడ్లీల్లా వచ్చేస్తాయి. వీటిని ఏదయినా కూరతో కలిపి వడ్డించాలి.