ఇడ్లీ ఉప్మా
 • 663 Views

ఇడ్లీ ఉప్మా

కావలసినవి:

 • ఇడ్లీలు -4,
 • పెద్ద ఉల్లిపాయ - 1 (సన్నగా కట్ చేసుకోవాలి),
 • పచ్చిమిర్చి - రెండు (నిలువుగా కట్ చేసుకోవాలి),
 • జీడిపప్పులు - 10,
 • తాలింపు గింజలు - టీ స్పూను,
 • నిమ్మరసం - టేబుల్ స్పూను,
 • క్యారట్ తురుము - అర కప్పు,
 • పచ్చిబఠాణీ - పావుకప్పు,
 • నూనె - రెండు టీ స్పూన్లు,
 • పసుపు - చిటికెడు,
 • కరివేపాకు - రెండు రెమ్మలు,
 • కొత్తిమీర - చిన్న కట్ట,
 •  ఉప్పు - తగినంత

విధానం:

ముందుగా ఇడ్లీలను ఒక ప్లేట్‌లో పొడిపొడిగా చేసి ఉంచుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి అందులో తాలింపు వేయించాలి. బాగా వేగిన తరవాత పచ్చిమిర్చి తరుగు, ఉల్లి తరుగు, వేసి వేయించాలి. తరవాత పచ్చిబఠాణీ, కరివేపాకు, జీడిపప్పులను జత చేయాలి. అన్నీ బాగా వేగాక, అందులో ఇడ్లీ పొడి, పసుపు, ఉప్పు వేసి కలిపి, ఆ పైన క్యారట్ తురుము చల్లాలి. ఈ మిశ్రమాన్ని ఒక డిష్‌లోకి తీసుకుని కొత్తిమీర, నిమ్మరసం, జీడిపప్పు పలుకులు వేసి కలిపి అల్లం చట్నీతో సర్వ్ చేయాలి.