ఇరానీ సమోసా
  • 579 Views

ఇరానీ సమోసా

కావలసినవి:

  • బంగాళదుంపలు - అరకిలో,
  • మైదాపిండి - పావుకిలో
  • ఉల్లిపాయలు - 2,
  • ఉప్పు - తగినంత,
  • పసుపు - చిటికెడు
  • వాము - 1 టీ స్పూన్‌,
  • డాల్డా - 50 గ్రాములు,
  • పచ్చిమిర్చి - 10
  • నూనె - వేయించుకోడానికి సరిపడా
  • అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 1 టేబుల్‌ స్పూన్‌,
  • పచ్చిబఠాణీలు - 1 కప్పు

విధానం:

ఉప్పు, వాము, డాల్డా మైదాపిండిలో వేసి సరిపడినన్ని నీళ్లుపోసి చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి. బంగాళదుంపలు ఉడికించి పొట్టు తీసి ముక్కలు కోసుకోవాలి. బఠాణీలు ఉడికించాలి. బాండీలో కొంచెం నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, పసుపు, కొత్తిమీర తరుగు, బంగాళ దుంప ముక్కలు వేసి ఐదు నిమిషాలు వేయించాలి. తర్వాత ఉడికించిన బఠాణీలు, ఉప్పు, నిమ్మరసం వేసి కలపాలి. ఇప్పుడు సమోసాలో పెట్టే కూర రెడీ.
Andhra vantalu
ముందుగా కలిపి పెట్టుకున్న మైదాపిండిని నిమ్మకాయ సైజులో చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. వీటిని కోడిగుడ్డు ఆకారంలో చపాతీలా రుద్దాలి. దాన్ని సగానికి అడ్డంగా చాకుతో కొయ్యాలి. ఒక్కో ముక్కను తీసుకుని రెండు చివరలు అతికిస్తే కోన్‌లా (మిఠాయి పొట్లంలా) అవుతుంది. అందులో బంగాళదుంప కూర నింపి అంచులకు తడి అంటించి మూసెయ్యాలి. వీటిని కాగిన నూనెలో దోరగా వేయించి తీస్తే చాలు. వేడి వేడి సమోసాలు రెడీ. ఇందులో బంగాళదుంప బదులు క్యారెట్లు, బీన్స్‌, క్యాబేజీ కూడా వేసుకోవచ్చు.