అయ్యంగార్ పులిహోర
 • 634 Views

అయ్యంగార్ పులిహోర

కావలసినవి:

 • బియ్యం - అరకేజీ,
 • చింతపండు - 150 గ్రా.,
 • నూనె - 200గ్రా.,
 • ఎండుమిర్చి - 10,
 • ఆవాలు - టీ స్పూను,
 • మెంతులు - అర టీ స్పూను,
 • జీలకర్ర - టీ స్పూను,
 • ధనియాలు - 25 గ్రా.
 • మిరియాలు - 5 గ్రా.,
 • శనగపప్పు - 25 గ్రా.,
 • మినప్పప్పు - 25 గ్రా.,
 • పల్లీలు - 50 గ్రా.,
 • తెల్లనువ్వులు - 25 గ్రా.,
 • ఇంగువ - తగినంత,
 • పసుపు - తగినంత,
 • బెల్లం -10గ్రా.,
 • కరివేపాకు - కప్పు,
 • ఉప్పు - తగినంత

విధానం:

చింతపండు నానబెట్టి చిక్కగా గుజ్జు తీసుకోవాలి. బాణలిలో నూనె వేడయ్యాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, మిరియాలు, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, నువ్వులు ఒకదాని తరవాత ఒకటి వేస్తూ దోరగా వేగిన తరవాత ఇంగువ, పసుపు, చింతపండు గుజ్జు, బెల్లం, కరివేపాకు వేసి బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. నూనె బాగా పైకి తేరిన తరవాత స్టౌ ఆపేయాలి. పొడిపొడిగా వండిన అన్నంలో ఉప్పు, పై మిశ్రమాన్ని వేసి బాగాకలపాలి. అరగంట ఆయిన తరవాత అయ్యంగార్ పులిహోర సర్వ్ చేసుకోవాలి.