పనస బంగాళదుంపకూర
  • 222 Views

పనస బంగాళదుంపకూర

కావలసినవి:

  • పనసగింజలు - 15,
  • బంగాళదుంప -1,
  • పచ్చిబఠాణి - 30 గ్రా.,
  • నూనె - 2 టీ స్పూన్లు,
  • ఆవాలు - అర టీ స్పూను, ఇంగువ - చిటికెడు,
  • పసుపు - పావు టీ స్పూను,
  • ఉల్లిపాయ - 1,
  • కరివేపాకు - 4 రెబ్బలు,
  • సాంబారు పొడి - 1 టీ స్పూను,
  • ఉప్పు - రుచికి తగినంత.

విధానం:

పనసగింజల పై తొక్క తీసి కడిగి ముక్కలుగా తరగాలి. సరిపడ నీరు చేర్చి బంగాళదుంపతో పాటు కుక్కర్లో మెత్తగా ఉడికించాలి. కడాయిలో నూనె వేసి ఆవాలు, ఇంగువ, ఉల్లి, కరివేపాకు, పసుపు వేగాక ఉడికిన ముక్కలు, ఉప్పు, సాంబారు పొడి వేసి సన్నని సెగమీద మగ్గనివ్వాలి. తర్వాత పచ్చిబఠాణి వేసి మరో 5 నిమిషాలు ఉంచి దించేయాలి. ఈ కూర అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.