జామ్‌ పరోటా
  • 342 Views

జామ్‌ పరోటా

కావలసినవి:

  • కావలసిన పదార్థాలు
  • గోధుమపిండి-రెండు కప్పులు,
  • జామ్‌-కప్పు,
  • ఉప్పు-తగినంత,
  • జీలకర్ర పొడి-అరచెంచా,
  • నూనె-కప్పు,
  • వెన్న- రెండు టేబుల్‌ స్పూన్లు.

విధానం:

ఓ గిన్నెలో గోధుమ పిండి, జీలకర్ర పొడి ,ఉప్పు తీసుకుని కలపాలి. తరువాత నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి. కొద్దిగా పిండిని తీసుకుని చపాతీలా వత్తుకుని తీసుకోవాలి. అలాగే మరికొంచెం పిండి కూడా తీసుకుని అదే సైజులో చపాతీ చేసుకోవాలి. ఒకదానిపై కొద్దిగా వెన్న, జామ్‌ని పూతలా రాయాలి. దానిపైనా కొద్దిగా వెన్న, జామ్‌ని పూతలా రాయాలి. దానిపైన మరో చపాతీ ఉంచి అంచుల్ని అతికించేయాలి. దీన్ని వేడిపెనంపై ఉంచి నూనె వేసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా మిగిలిన పిండిని కూడా చేసుకుంటే సరి.