జాంగ్రీ
  • 565 Views

జాంగ్రీ

కావలసినవి:

  • మినప్పప్పు : 2 కప్పులు,
  • పంచదార : 3 కప్పులు,
  • మంచినీళ్లు : 2 కప్పులు,
  • ఆరెంజ్‌ కలర్‌: టీ స్పూన్‌,
  • యాలకుల పొడి : అర టీ స్పూన్‌,
  • నెయ్యి లేదా నూనె : వేయించడానికి సరిపడా

విధానం:

మినప్పప్పుని రాత్రంతా నానబెట్టి రుబ్బుకోవాలి. తరవాత అందులో రంగు వేసి కలపాలి. మిక్సీలో పిండిని రుబ్బితే తరవాత చేత్తో బాగా గిలకొట్టాలి. ఇప్పుడు దీన్ని 3 గంటలు పులియనివ్వాలి. వాతావరణం చల్లగా ఉంటే ఆరు గంటలు పులియనివ్వాలి. పపంచదారలో నీళ్లు పోసి పలుచని తీగపాకం రానివ్వాలి. తరవాత యాలకుల పొడి వేసి ఉంచాలి. బాణలిలో నెయ్యి పోసి కాగనివ్వాలి. ఇప్పుడు రంధ్రం ఉన్న ప్లాస్టిక్‌ బాటిల్‌ / బట్టలో పిండి మిశ్రమం వేసి జాంగ్రీల్లా చుట్టి తక్కువ మంట మీద వేయించి తీసి పాకంలో ముంచి నాలుగైదు నిమిషాలు ఉంచి తీయాలి.