జిలేబి
  • 447 Views

జిలేబి

కావలసినవి:

  • మైదా: 1 1/2cup
  • పెసర పిండి: 2tbsp
  • పంచదార(షుగర్ ఫ్రీ): 2tbsp
  • పంచదార: 3cups
  • వంట సోడా చిటికెడు
  • నిమ్మరసం: 1tsp
  • యాలకుల పొడి 1/2 ts
  • నెయ్యి లేదా నూనె వేయించడానికి
  • కేసర్ రంగు చిటికెడు

విధానం:

మొదటగా మైదా, రెండు టేబుల్ స్పూన్ల పెసర పిండిలో వంటసోడా, ఒక స్పూన్ నెయ్యి, నిమ్మరసం, కేసర్ రంగు వేసి నీరు పోసి చిక్కగా ఉండలు లేకుండా కలిపి రాత్రంతా అలాగే ఉంచాలి.  పిండి బాగా పులిసి తీగ లాగా సాగితేనే జిలేబీ బాగా వస్తుంది.మరునాడు పొద్దున్న పిండిని మళ్ళీ కలిపి కావాలంటే కాస్త రంగు,నీరు కలిపి గరిటజారుగ కలిపి పెట్టుకోవాలి. తర్వాత చక్కెరలో అరగ్లాసు నీరు పోసి మరిగించి తీగ పాకం పట్టి ఉంచుకోవాలి. అందులోనే యాలకులపోడి కలిపాలి.  జిలేబీలు చేయడానికి ఒక మందపాటి గుడ్డకు చిన్న రంధ్రము చేసి అందులో పిండి వేసి చుట్టలాగ పట్టుకుని వేడి నూనెలో చుట్టలుగా వత్తుకోవాలి. జిలేబీలను కాస్త దోరగా వేయించి తీసి పాకంలో వేయాలి. పదినిమిషాలతర్వాత తీసి విడి పళ్ళెంలో తీసుకొని కొద్దిసేపు తర్వాత తింటే పాకం అంతా జిలేబిలకు పట్టి, కలర్ ఫుల్ గానే కాదు ఎంతో రుచిగా ఉంటుంది.