జుగల్‌బందీ
  • 370 Views

జుగల్‌బందీ

కావలసినవి:

  • ఉడికించిన పచ్చ బఠాణీలు - అర కప్పు
  • ఉడికించిన క్యారెట్ ముక్కలు - అర కప్పు
  • ఉడికించిన గుడ్ల ముక్కలు (తెల్లసొన) - కప్పు
  • ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు
  • పచ్చిమిర్చి తరుగు - అర టీ స్పూన్
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూన్
  • కారం - కొద్దిగా
  • గ రం మసాలా - పావు టీ స్పూన్
  • మైదా - తగినంత

విధానం:

స్టౌ పై పాన్ పెట్టి, టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లిపేస్ట్, కారం, గరం మసాలా వేసి 5 నిమిషాలు వేయించాలి. దీంట్లో గుడ్ల ముక్కలను వేసి 2 నిమిషాలు వేయించాలి. ఈ మిశ్రమం చల్లారనివ్వాలి.   మైదాను ముద్దలా కలపాలి. అచ్చు పరికరంలో కొద్దిగా పిండి పెట్టి, వత్తి, కాగుతున్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. ఇవి చిన్న చిన్న కప్పుల మాదిరిగా వస్తాయి. వీటిలో గుడ్లముక్కలు అందంగా సర్దుకొని, తయారుచేసుకున్న పచ్చిబఠాణీల మిశ్రమం వేసి స్టఫ్ చే సి, సర్వ్ చేయాలి