కాజు బర్ఫీ
  • 513 Views

కాజు బర్ఫీ

కావలసినవి:

  • జీడిపప్పు - పావు కేజీ,
  • పంచదార - 200 గ్రా,
  •  నెయ్యి - 50 గ్రా,
  •  సిల్వర్ ఫాయిల్ - ఒక షీట్ (ఇష్టమైతే వాడవచ్చు, లేకపోయినా పరవాలేదు)

విధానం:

జీడిపప్పులను తగినంత నీటిలో రెండు గంటలపాటు నానబెట్టాలి. తరవాత నీరు వంపేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. (అవసరమనుకుంటే కొద్దిగా నీరు పోయవచ్చు). ఒక పెద్ద బాణలిలో జీడిపప్పు పేస్ట్, పంచదార వేసి స్టౌ
మీద ఉంచి సన్నని సెగ మీద బాగా ఉడికేవరకు కలుపుతుండాలి. చివరగా నెయ్యి వేసి బాగా కలిపి దించేయాలి. ఒక ప్లేట్‌కి నెయ్యి పూసి అందులో ఈ మిశ్రమాన్ని వేసి అంతటా సమంగా పరుచుకునేలా చేయాలి. (సిల్వర్ ఫాయిల్ వాడేట్లయితే ఈ మిశ్రమం మీద కొద్దిగా నెయ్యి పూసి పైన ఫాయిల్ అతికించాలి). కొద్దిగా చల్లారాక డైమండ్ ఆకారంలో కట్‌చేసుకోవాలి. రెండు గంటలు పూర్తిగా ఆరిన తరవాత కట్ చేసిన ముక్కలను తీసి డబ్బాలో భద్రపరచుకోవాలి.