కడై దాల్ తడ్కా
 • 347 Views

కడై దాల్ తడ్కా

కావలసినవి:

 • కందిపప్పు - 100 గ్రా.
 • నూనె - 25 గ్రా.
 • నెయ్యి - 10 గ్రా.
 • ఆవాలు - టీ స్పూను
 • జీలకర్ర - టీ స్పూను
 • ఎండుమిర్చి - 4
 • పసుపు - చిటికెడు
 • మిరప్పొడి - అర టీ స్పూను
 • ఉప్పు - తగినంత
 • పచ్చిమిర్చి - 4
 • కొత్తిమీర - కొత్తిగా
 • కరివేపాకు - రెండు రెమ్మలు
 • ఇంగువ - కొద్దిగా
 • అల్లం తరుగు - కొద్దిగా
 • వెల్లుల్లి తరుగు - కొద్దిగా
 • టొమాటో తరుగు - పావు కప్పు

విధానం:

కడాయిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అల్లం తరుగు వేసి దోరగా వేయించాలి టొమాటో, పసుపు, మిరప్పొడి వేసి మరోమారు వేయించాలి.కరివేపాకు, కొత్తిమీర, ఉడికించిన కందిపప్పు వేసి అన్నీ బాగా కలిసేలా రెండు నిముషాలు ఉడికించాలి బాణలిలో నెయ్యి వేసి కాగాక మిరప్పొడి వేసి కొద్దిగా వేయించి, అందు లో పప్పు వేసి కలిపి వేడివేడిగా చపాతీలతో సర్వ్ చేయాలి.