చికెన్‌ని కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పాన్‌లో నూనె లేదా నెయ్యిని వేడి చేసి అందులో ఉల్లిపాయ తరుగు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తర్వాత అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి కాసేపు వేయించి టొమాటో ముక్కలు కూడా వేసి కలిపి సెగ మీద ఉంచాలి. అందులో టొమాటో గుజ్జు, తగినన్ని నీటిని చేర్చాలి. ఈ మిశ్రమంలో ఉప్పు, ఎండుమిర్చి, కచ్చాపచ్చాగా దంచిన ధనియాలు, వెనిగర్, గరం మసాల పౌడర్ వేయాలి. ఇవన్నీ ఉడుకుతుండగా చికెన్ ముక్కలను కలిపి గ్రేవి చిక్కపడి ఎరుపు రంగు వచ్చే వరకు ఉడికించాలి. దించే ముందు కావాలనుకుంటే కలర్ క్యాప్సికమ్ ముక్కలను వేసి రెండు నిమిషాలపాటు ఉంచి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి