కడై పనీర్
  • 509 Views

కడై పనీర్

కావలసినవి:

  • పనీర్- 100 గ్రా. (ముక్కలుగా కట్ చేయాలి)
  • క్యాప్సికమ్ ముక్కలు - పావు కప్పు
  • ఉల్లి తరుగు - పావు కప్పు
  • ఉల్లిముక్కలు - అర కప్పు (పెద్దవిగా తరగాలి)
  • టొమాటో తరుగు - అర కప్పు
  • పసుపు - చిటికెడు, మిరప్పొడి - టీ స్పూను
  • కొత్తిమీర - కట్ట, పచ్చిమిర్చి - 5
  • మిరియాలపొడి - అర టీ స్పూను
  • గరంమసాలా - అర టీ స్పూను
  • ఉప్పు - తగినంత, నల్ల ఉప్పు - చిటికెడు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను
  • షాజీరా - పావు టీ స్పూను


డ్రై ఫ్రూట్ గ్రేవీ కోసం

  • పల్లీలు - 10 గ్రా.
  • జీడిపప్పు - నాలుగైదు పలుకులు
  • కర్బూజా గింజలు - 10 గ్రా.
  • బాదంపప్పు - 10 గ్రా., నూనె - 5 గ్రా.
  • (డ్రైఫ్రూట్స్‌ని వేయించి చల్లారాక కొద్దిగా నీరు కలిపి మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి)

విధానం:

బాణలిలో నూనె కాగాక, షాజీరా, ఎండుమిర్చి, ఉల్లి తరుగు వేసి దోరగా వే గాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.
టొమాటో తరుగు, మిగిలిన సరుకులను వేసి మరోమారు వేయించి, నూనె పైకి తేలుతున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి కలపాలి. బాగా వేగిన తరవాత పనీర్ ముక్కలు, డ్రై ఫ్రూట్ గ్రేవీ పేస్ట్ వేసి కలిపి, ఐదు నిముషాలు ఉడికించాలి. కడాయిలోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్‌చేసి సర్వ్ చేయాలి.