కద్దూ కట్లెట్‌
  • 307 Views

కద్దూ కట్లెట్‌

కావలసినవి:

  • సొరకాయ - 1 చిన్నది,
  • బియ్యం పిండి - 5 స్పూన్లు
  • పచ్చిమిర్చి పేస్ట్‌ - 2 స్పూన్లు,
  • కొత్తిమీర - 2 స్పూన్లు
  • జీలకర్ర - 2 స్పూన్లు,
  • తరిగిన కరివేపాకు - 2 స్పూన్లు
  • ఉల్లిపాయ - 1,
  • ఉప్పు - తగినంత,
  • పెసరపప్పు - 3 స్పూన్లు
  • నూనె - వేయించడానికి సరిపడా

విధానం:

సొరకాయని తురుముకోవాలి. దానిలో పచ్చిమిర్చి పేస్ట్‌, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, నానబెట్టిన పెసరపప్పు, తరిగిన కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, బియ్యంపిండి వేసుకుని ముద్దగా కలపాలి. అదనంగా నీళ్లు పొయ్యకుండా సొరకాయ రసంతోనే ముద్దవుతుంది. అవసరమైతే మరికొంత బియ్యంపిండి వేసుకోవచ్చు. ఈ ముద్దని చిన్న చిన్న వుండలు చేసుకుని గారెల్లా చేసి కాగిన నూనెలో దోరగా వేయించాలి. కద్దూ కట్లెట్‌ వేడివేడిగా తింటే క్రిస్పీగా చాలా బావుంటాయి.