కద్దూ కా మీఠా
 • 415 Views

కద్దూ కా మీఠా

కావలసినవి:

 • తీపి గుమ్మడికాయ - 250 గ్రా.
 • అల్లం తరుగు - టీ స్పూను,
 • మెంతులు - అర టీ స్పూను
 • పసుపు - చిటికెడు,
 • మిరప్పొడి - రెండు టీ స్పూన్లు
 • గరంమసాలా - టీ స్పూను,
 • ఉప్పు - తగినంత
 • పంచదార - 100 గ్రా,
 • నూనె - 25 గ్రా
 • ఇంగువ - చిటికెడు

విధానం:

బాణలిలో వేసిన రెండు టీ స్పూన్ల నూనె కాగాక మెంతులు, ఇంగువ, పసుపు, మిరప్పొడి, ఉప్పు, అల్లం ముక్కలు వేసి వేగనివ్వాలి. ఇందులో గుమ్మడికాయముక్కలు వేసి బాగా కలపాలి. తరవాత అందులో కప్పుడు నీరు పోసి మూతపెట్టి, సన్న మంట మీద ఉడకనివ్వాలి. గుమ్మడికాయ ముక్కలను మెత్తబడే వరకు ఉడకనిచ్చి, గరంమసాలా, పంచదార వేసి బాగా కలిపి రెండునిమిషాలు ఉంచి దింపేయాలి. కద్దూ కా మీఠా అన్నంలోకి, చపాతీలలోకి బావుంటుంది.