ముందుగా బాస్మతి బియ్యాన్ని చిటికెడు నెయ్యిలో వేయించి పిండి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలో పాలు పోసి అవి మరుగుతున్నప్పుడు బియ్యం పిండిని నీళ్లలో కలిపి పేస్టులా చేసి గరిటెతో కలుపుతూ ఆ పాలల్లో పోయాలి. అలాగే మొక్కజొన్న పిండిని కూడా పేస్టులా చేసి అందులో పోయాలి. దాంతోపాటు సొరకాయ తురుమును కాస్త ఉడికించి పాలల్లో వేయాలి. తర్వాత చక్కెర వేసి కాస్త చల్లారిన తర్వాత కోవా, మిల్క్ మెయిడ్, గ్రీన్ కలర్లను వేసి బాగా కలపాలి. చివరగా జీడిపప్పు, బాదంపప్పు, ఎండుద్రాక్షలను నెయ్యిలో దోరగా వేయించి నెయ్యితో పాటు పాయసంలో పోసి ఒక అరగంట డీప్ ఫ్రిజ్లో పెట్టి సర్వ్ చేస్తే చాలా మధురంగా ఉంటుంది. ఈ పాయసం ఫ్రిజ్లో వారం, పది రోజుల పాటు నిల్వ ఉంటుంది.