బూడిద గుమ్మడికాయను శుభ్రంగా కడిగి, చెక్కు తీసి గింజలు లేకుండా సన్నగా తురుముకోవాలి. పాన్ లో నెయ్యివేసి జీర, ద్రాక్ష, జీడి పప్పులు వేయించి తీసుకోవాలి. అందులోనే గుమ్మడితురుము వేసి కాసేపు మగ్గనివ్వాలి. పాలు పోసి సన్నని మంటపై ఉడికించాలి. తరువాత (చిక్కబడ్డాక) పంచదార, కోవా, యాలకులపొడి వేసి బాగా ఉడికించాలి. దించేముందు పప్పులు కూడా వేసి దింపాలి