ఒక గిన్నెలో శనగపిండి, బియ్యప్పిండి, కారం, పచ్చిమిర్చి తరుగు, తగినంత నీరు జీలకరప్రొడి, కరివేపాకు, ఉప్పు వేసి పకోడీల పిండి మాదిరిగా కలుపుకోవాలి. తరవాత జీడిపప్పులను కూడా వేసి మరోమారు కలపాలి. స్టౌ మీద బాణలిలో నూనె కాగిన తరవాత పకోడీలుగా వేసి బంగారురంగు వచ్చేవరకు వేయించి తీసేయాలి. వీటిని రుచికరమైన కొబ్బరి చట్నీతో అందిస్తే బావుంటాయి.