కలాకండ్
  • 349 Views

కలాకండ్

కావలసినవి:

  • పనీర్ - 500 గ్రా,
  • మిల్క్ మెయిడ్ - 400 గ్రా
  • పాల పొడి - రెండు కప్పులు,
  • కుంకుమ పువ్వు - చిటికెడు
  • (కలర్ కోసం ఒక టీ స్పూన్ వేడి పాలలో వేసి ఉంచాలి),
  • నెయ్యి - టీ స్పూన్,
  • బాదం- నాలుగు (నానబెట్టి ఒలిచి పలుచగా తరగాలి),
  • పిస్తా - టీ స్పూన్

విధానం:

పనీర్‌ను మెత్తగా పొడి అయ్యేటట్లు చేత్తో చిదమాలి. అందులో మిల్క్‌మెయిడ్, పాల పొడి కలపాలి. ఆ మిశ్రమాన్ని అడుగు మందంగా ఉన్న పాత్రలో వేసి సన్న మంట మీద గరిటెతో కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం దగ్గరగా అయిన తర్వాత దించి దానిని మూడు భాగాలుగా చేయాలి. ఒక భాగంలో కుంకుమ పువ్వు కలిపిన పాలను వేసి సమంగా పట్టేటట్లు కలిపితే ఆరెంజ్ కలర్‌లోకి వస్తుంది.