కమలా పండ్ల పైతోలు తీసి, ఒక బట్టలో వేసి రసం తీయాలి. కమలా రసంలో గింజలు రాకుండా రసం పిండాలి. ఒక స్టీలు గరిటె వేడి చేసి అందులో తేనె పోసి, ఆ తేనెని కమలా రసంలో కలపాలి. దానిలో చిటికెడు తినే సోడా కలిపి ఓ గంటసేపు ఫ్రిజ్లో పెట్టాలి. గ్లాసులో ఐస్ ముక్కలువేసి ఈ రసాన్ని పోసి సర్వ్ చేయాలి.