కంద వడలు
  • 715 Views

కంద వడలు

కావలసినవి:

  • కంద : అర కిలో,
  • పెసరపప్పు : 150 గ్రా,
  • ఉల్లిపాయలు (పెద్దవి) : 5,
  • అల్లం : చిన్నముక్క,
  • పచ్చిమిర్చి : 10,
  • జీలకర్ర : 1 చెంచా,
  • ఉప్పు : తగినంత
  • నూనె : పావుకిలో

విధానం:

పెసరపప్పును గంటసేపు నానబెట్టాలి. కందను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. పెసరపప్పు, కంద, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు కలిపి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా తరిగి ఈ ముద్దలో కలపాలి. స్టవ్‌మీద నూనె పెట్టి కాగనివ్వాలి. పిండిని వడలుగా చేతి మీద ఒత్తుకుని నూనెలో వేసి దోరగా వేయించాలి. ఇవి చిరుతిండిగానే కాక అన్నంతో తినడానికి కూడా బావుంటాయి.