ముందుగా బాణలిలో సోంపు, జీలకర్ర, వాము, మిరియాలను నూనె లేకుండా వేయించి, చల్లార్చి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ఒక పాత్రలో గోధుమపిండి, పొడి చేసి ఉంచుకున్న మసాలా, ఇంగువ, పాలు, ఉప్పు, తగినన్ని నీళ్లు వేసి, చపాతీ పిండిలా కలిపి పక్కన ఉంచాలి స్టౌ మీద పెనం ఉంచి వేడి చేయాలి పిండిని కొద్దిగా తీసుకుని చపాతీలా ఒత్తి, పెనం మీద వేసి రెండువైపులా నేతితో కాల్చి తీయాలి. వేడివేడిగా ఏదైనా కూరతో అందించాలి.