ఒక బౌల్లో మైదా, పాలు, పంచదార, ఉప్పు వేసి చపాతీపిండిలా కలిపి పావుగంటసేపు నాననివ్వాలి. తరవాత ఉండలు చేసి నచ్చిన ఆకారంలో నాన్ని ఒత్తుకుని పక్కన ఉంచుకోవాలి. స్టౌ మీద పెనం వేడయ్యాక కొద్దిగా బటర్ వేసి నాన్ని పచ్చిపచ్చిగా కాల్చి తీసేయాలి. దానికి ఒకవైపు జామ్ పూసి, దాని మీద పండ్లముక్కలు గట్టిగా అదిమి, మరోమారు పెనం మీద బటర్ వేసి రెండువైపులా కాల్చాలి. చివరగా జీడిపప్పు, ద్రాక్ష, చెర్రీ, కొత్తిమీర, పనీర్తురుములతో గార్నిష్ చేయాలి.