కాశ్మీరీ పులావ్
  • 349 Views

కాశ్మీరీ పులావ్

కావలసినవి:

  • బాస్మతి రైస్- 500 గ్రా
  • ఉల్లిపాయ ముక్కలు- 100గ్రా
  • దాల్చిన చెక్క - 5 గ్రా
  • ఏలకులు - 5 గ్రా
  • లవంగాలు - 5 గ్రా
  • జీలకర్ర - అర స్పూన్
  • బిర్యానీ ఆకు- ఒకటి
  • కుంకుమ పువ్వు - గ్రాము
  • పాలు - 10 మి.లీ
  • వాల్‌నట్ - 20 గ్రా
  • జీడిపప్పు- 20 గ్రా
  • కిస్‌మిస్ - 20 గ్రా
  • ఆపిల్ ముక్కలు - 50 గ్రా
  • పియర్ ముక్కలు- 50 గ్రా
  • నీరు- లీటరు
  • నెయ్యి- 50 గ్రా
  • ఉప్పు- తగినంత
  • తరిగిన కొత్తిమీర- కప్పు

విధానం:

బియ్యం కడిగి నీటిని పూర్తిగా వంపేయాలి. మందపాటి పాత్రలో నేతిని వేడి చేసి కిస్‌మిస్, వాల్‌నట్, జీడిపప్పులను వేయించి విడిగా తీసుకోవాలి. మిగిలిన నేతిలో ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఏలకులు, లవంగాలు వేసి వేయించాలి. అవి వేగిన తర్వాత కడిగిన బియ్యాన్ని వేసి రెండు నిమిషాల పాటు సన్నమంట మీద వేయించాలి. ఇప్పుడు పాలు, కుంకుమ పువ్వు, నీరు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. నీరు మరగడం మొదలైన తర్వాత మంట తగ్గించి నీరంతా ఇంకేదాకా ఉంచి దించేయాలి. (బియ్యం, నీరు పై కొలతలను పాటిస్తే అన్నం అతుక్కోకుండా విడివిడిగా వస్తుంది). తర్వాత కొత్తిమీర, పండ్ల ముక్కలు, వేయించిన కిస్‌మిస్, వాల్‌నట్, జీడిపప్పులతో గార్నిష్ చేయాలి. గార్నిష్ చేసిన తరవాత మూత పెడితే కొంత సేపటికి వాటి సువాసన రైస్‌కు పట్టి, రుచి ఇనుమడిస్తుంది.