కేసర్‌ జిలేబీ
  • 146 Views

కేసర్‌ జిలేబీ

కావలసినవి:

  • మైదా: 2 కప్పులు,
  • ఈస్ట్‌: అర టీ స్పూన్‌,
  • మంచినీళ్లు: 2 కప్పులు,
  • నెయ్యి లేదా నూనె: వేయించడానికి సరిపడా,
  • కుంకుమ పువ్వు: టీస్పూను,
  • ఆరెంజ్‌ కలర్‌ : అర టీ స్పూను.

విధానం:

ఈస్ట్‌ని నీళ్లలో కాసేపు నానబెట్టి మైదాలో వేసి కలపాలి. మరీ పలుచగా కాకుండా చిక్కగా జారేలా ఉండాలి. దీన్ని పన్నెండు గంటలు పులియనివ్వాలి. పులిసిందీ అనుకున్నాక పంచదారలో నీళ్లు పోసి మరిగించాలి. ఇప్పుడు పాలు పోసి మళ్లీ మరిగిస్తే మలినాలన్నీ నురగలో వచ్చేస్తాయి. అవి తీసేస్తే పాకం తేటగా ఉంటుంది. ఇప్పుడు కుంకుమ పువ్వు కూడా వేసి స్టవ్‌ ఆఫ్‌ చేసి ఉంచాలి. బాణలిలో నెయ్యి పోసి కాగనివ్వాలి. పులిసిన పిండిని బాగా కలిపి రంధ్రం చేసిన పలుచని బట్ట / ప్లాస్టిక్‌ బాటిల్‌/ కొబ్బరి చిప్పలో వేసి కాగిన నేతిలో జిలేబీలు చుట్టలా వేయాలి. అవి వేగాక తీసి పాకంలో వేసి ఐదు నిమిషాలు ఉంచి తీసేయాలి.