పాలల్లో పంచదార, కుంకుమ పువ్వువేసి మరిగించాలి. కొద్దిగా చిక్కబడ్డాక బాదాం, జీడిపప్పులు పొడి చేసి కలపాలి. గోరువెచ్చగా ఉన్నపుడు కొద్దిగా మజ్జిగ లేదా పెరుగు వేసి తోడుపెట్టాలి. పెరుగు తోడుకుని గట్టిపడ్డాక ఫ్రిజ్లో పెట్టాలి. బాగా చల్లబడ్డాక యాలకులపొడి కొద్దిగా ఐసు ముక్కలువేసి బాగా గిలక్కొట్టి పొడుగాటి గాజు గ్లాసులో పోసి సర్వ్ చేయాలి.