బియ్యాన్ని కడిగి నీటిని ఒంపేసి పక్కన ఉంచాలి. వెడల్పుగా అడుగు మందంగా ఉన్న పాత్ర తీసుకుని అందులో నెయ్యి వేయాలి. నెయ్యి వేడయిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేయించి తీసి పక్కన ఉంచాలి. తర్వాత అదే పాత్రలో బియ్యం వేసి వేయించాలి. బియ్యం వేగేటప్పుడు ఏలకులు వేయాలి. ఇవి వేగిన తరవాత నీటిని పోసి బిర్యానీ ఆకు వేసి ఉడికించాలి. ఒక మోస్తరుగా ఉడికిన తర్వాత పాలు, పంచదార, కుంకుమపువ్వు, పచ్చికోవా వేసి కలిపి సన్నమంట మీద ఉడకనివ్వాలి. పూర్తిగా ఉడికిన తర్వాత పైన జీడిపప్పు, బాదం, పిస్తాలతో అలంకరిస్తే కేసరిఖీర్ రెడీ.