కోవా క్యారెట్‌ డిలైట్
 • 370 Views

కోవా క్యారెట్‌ డిలైట్

కావలసినవి:

 • కావలసినవి...క్యారెట్‌ ముక్కలు (సన్నగా తరిగినవి) - మూడు కప్పులు
 • క్యారెట్‌ తురుము - అరకప్పు
 • కోవా - 100 గ్రా
 • పంచదార - రెండు కప్పులు
 • పాలు - 100 గ్రా
 • నెయ్యి - అరకప్పు
 • పచ్చి కొబ్బరి తురుము - ఒక కప్పు
 • జీడిపప్పు - పది పలుకులు
 • చెర్రీస్‌ - పది
 • యాలకుల పొడి - అర టీ స్పూన్‌
 • కుంకుమ పువ్వు - చిటికెడు

విధానం:

క్యారెట్‌ తురుము, క్యారెట్‌ ముక్కలకు కొద్దికొద్దిగా పాలు జతచేస్తూ విడివిడిగా ఉడికించుకోవాలి. ఉడికిన క్యారెట్‌ ముక్కలను మాత్రమే గ్రైండ్‌ చేసుకోవాలి. ఒక పాత్రలో నెయ్యి వేసి జీడిపప్పును వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఉడికిన క్యారెట్‌ తురుముని, గ్రైండ్‌ చేసుకున్న మిశ్రమాన్ని వేసి ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి. తరువాత పంచదార కలిపి అడుగంటకుండా కలియబెడు తూ ఉండాలి. ఈలోపు కోవా, పచ్చి కొబ్బరిని గ్రైండ్‌ చేసుకొని అందులో వేసి కలుపుకోవాలి. మిగిలిన పాలు వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. చివరగా యాలకుల పొడి, జీడిపప్పు, కుంకుమ పువ్వుతో గార్నిష్‌ చేసుకోవాలి. అంతే... కోవా క్యారెట్‌ డిలైట్‌ రెడీ.