కీరా రైతా
  • 518 Views

కీరా రైతా

కావలసినవి:

  • కీరకాయలు - పావుకేజీ (చెక్కు తీసి సన్నగా తరగాలి),
  • పెరుగు - కప్పు (చిలకాలి),
  • వేయించిన శనగపప్పు పొడి - 50 గ్రా (పుట్నాల పొడి),
  • ఉప్పు - తగినంత.


పోపు కోసం:

  • నూనె - టీ స్పూన్,
  • ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర - పావు టీ స్పూన్ చొప్పున,
  • అల్లం వెల్లుల్లి పేస్టు - అర టీ స్పూన్, కొత్తిమీర - చిన్న కట్ట,
  • కరివేపాకు - రెండు రెమ్మలు

విధానం:

పెరుగును చిలికిన తర్వాత అందులో ఉప్పు, పుట్నాల పొడి, ఉప్పు, కీర ముక్కలు వేసి కలపాలి. బాణలిలో నూనె వేసి పోపు కోసం తీసుకున్న దినుసులన్నీ వేసి వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసి దించాలి. పోపు చల్లారిన తర్వాత పెరుగు మిశ్రమంలో కలపాలి. ఇది పులిహోరకు మంచి కాంబినేషన్. వేసవిలో పులిహోర తింటే వేడి చేస్తుందని జిహ్వను అదుపులో పెట్టుకుంటాం. కానీ కీరారైతాతో తింటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.