కొరమీను ములక్కాయ కూర
  • 180 Views

కొరమీను ములక్కాయ కూర

కావలసినవి:

  • చేప ముక్కలు - 600 గ్రా
  • కారం - నాలుగు టీ స్పూన్లు
  • ధనియాల పొడి - రెండు టీ స్పూన్లు
  • చింతపండు గుజ్జు - అర కప్పు
  • కొబ్బరిమద్ద - కప్పు
  • పచ్చిమిర్చి - 10 (కచ్చాపచ్చాగ దంచాలి)
  • ములక్కాయలు - 2 (చిన్న ముక్కలుగా కట్ చేయాలి)
  • నూనె - అర కప్పు,
  • జీలకర్ర పొడి - టీ స్పూన్
  • ఎండుమిర్చి - 5,
  • కరివేపాకు - రెమ్మ
  • పసుపు - అర టీ స్పూన్,
  • ఉప్పు - తగినంత

విధానం:

చేపముక్కలను శుభ్రంగా కడిగి పక్కనపెట్టుకోవాలి. స్టౌ మీద పాన్ పెట్టి రెండు టీ స్పూన్ల నూనె వేసి వేడెక్కాక అందులో కొబ్బరి ముద్ద, పచ్చిమిర్చి, ధనియాలపొడి, కారం, పసుపు తగినంత ఉప్పు వేసి రెండు నిమిషాలు వేయించాలి. తర్వాత రెండు కప్పుల నీళ్లు పోసి మూతపెట్టాలి. ఈ మిశ్రమం కాస్త చిక్కపడ్డాక అందులో కట్ చేసిన ములక్కాయ ముక్కలు, చింతపండు గుజ్జుని పోసి సన్నటి సెగ మీద ఉంచాలి. ఇది ఉడుకుతుండగా మధ్యలో చేప ముక్కలను కూడా జతచేసి మూతపెట్టాలి. ఈ మిశ్రమమంతా దగ్గరగా వస్తుండగా దించి వేరొక పాన్‌లో మిగిలిన నూనె వేయాలి. అది వేడెక్కాక అందులో జీలకర్రపొడి, కరివేపాకు, ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టాలి. వేయించిన తాలింపును ఉడికించిన కూరలో కలిపి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. ఈ కొరమీను ములక్కాయ కూరను వేడి వేడి అన్నంతో తింటే భలే రుచిగా ఉంటుంది.