కోరీ గస్సీ
 • 297 Views

కోరీ గస్సీ

కావలసినవి:

 • చికెన్ బ్రెస్ట్-200 గ్రా
 • ఉల్లిపాయ తరుగు-ముప్పావు కప్పు
 • ఎండుమిర్చి-ఆరు,
 • ధనియాలు-టీ స్పూన్ జీలకర్ర-అర టీ స్పూన్,
 • గరం మసాల దినుసులు-2 గ్రా,
 • పచ్చికొబ్బరి తురుము-కప్పు,
 • కొబ్బరిపాలు-100 మి.లీ,
 • కారం-టీ స్పూన్
 • పసుపు-చిటికెడు,
 • కొత్తిమీర-కట్ట,
 • ఉప్పు-తగినంత
 • అల్లం వెల్లుల్లి పేస్టు-ఒకటిన్నర టీ స్పూన్లు,
 • నూనె-15 గ్రా

విధానం:

ముందుగా చికెన్ బ్రెస్ట్ పీసెస్‌ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పాన్‌లో ఎండుమిర్చి, గరం మసాల దినుసులు, పచ్చికొబ్చరి తురుము వేసి రోస్ట్ చేసి చల్లారిన తర్వాత మెత్తగా పేస్ట్ చేయాలి. ఇప్పుడు స్టౌ మీద వేరొక పాన్ పెట్టి నూనె వేయాలి. వేడెక్కాక అల్లంవెల్లుల్లి ముద్ద, పైన పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసి కాస్త వేగాక అందులో కొబ్బరి పాలు పోసి కాస్త చిక్కగా అవుతుండగా అందులో ఉప్పు తగినన్ని నీళ్లు, చికెన్ ముక్కలను వేసి మూత పెట్టి తక్కువ సెగ మీద ఉడికించాలి. ముక్క ఉడికిన తర్వాత పైన సన్నగా తరిగిన కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. దీన్ని వేడి వేడిగా రైస్ ఐటమ్స్‌తో కాని రోటిలతో కాని తింటే రుచిగా ఉంటుంది.