ముందుగా అన్నం వండి పక్కన ఉంచుకోవాలి. ఆ తరువాత పొయ్యి మీద మూకుడు ఉంచి నూనె కాగిన తర్వాత కొత్తిమీర వేయించి దానిలో జీలకర్ర , ఆవాలు, పచ్చి మిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, వేరుసెనగ గుళ్ళు, జీడిపప్పు వేసి వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత పసుపు, ఉప్పు, వండి పెట్టుకున్న అన్నం వేసి బాగా కలియబెట్టాలి. ఇంకేముంది! కొత్తి మీర రైస్ రెడీ!