క్యాలీఫ్లవర్‌ చికెన్‌
  • 348 Views

క్యాలీఫ్లవర్‌ చికెన్‌

కావలసినవి:

  • క్యాలీఫ్లవర్‌ - అరకిలో
  • టమాటాలు - 3
  • పెరుగు - 1 కప్పు
  • ఉప్పు - తగినంత
  • కారం - 2 టీ స్పూన్లు
  • నూనె - అరకప్పు, ఉల్లిపాయలు - 2
  • పచ్చిమిర్చి - 4, ధనియాల పొడి - 2 టీ స్పూన్లు
  • అల్లం పేస్ట్‌ - 1 టేబుల్‌ స్పూన్‌

విధానం:

చికెన్‌ చిన్న ముక్కలు కోసుకోవాలి. క్యాలీఫ్లవర్‌ను చిన్న పువ్వులుగా తెంపుకుని వేడినీటిలో ముంచి తియ్యాలి. బాండీలో నూనె కాగాక సన్నగా తరిగిన ఉల్లి, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి. అందులోనే అల్లం పేస్టును పచ్చివాసన పోయేలా వేయించాలి. చికెన్‌ ముక్కలు, ధనియాల పొడి వేసి కలిపి 5 నిమిషాలు మగ్గబెట్టాలి. తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు, పెరుగు వేసి మరో 5 నిమిషాలు ఉడికించాలి. క్యాలీఫ్లవర్‌ పూలు, ఉప్పు, కారం వేసి సన్న సెగమీద నీరంతా ఇంకిపోయే వరకు ఉడికించాలి. క్యాలీఫ్లవర్‌ చికెన్‌ బిర్యానీలోకి బాగుంటుంది.