క్యాప్సికం చట్నీ
 • 469 Views

క్యాప్సికం చట్నీ

కావలసినవి:

 • క్యాప్సికం-అర కిలో,
 • ఎండు మిరపకాయలు-8,
 • సెనగపప్పు-8 చెంచాలు,
 • మినప్పప్పు-6 చెంచాలు,
 • ఆవాలు-4 చెంచాలు,
 • మెంతులు-ఒకటిన్నర చెంచా,
 • కరివేపాకు-ఒక రెబ్బ,
 • నూనె-8 చెంచాలు,
 • పసుపు-అర చెంచా,
 • చింతపండు-కుంకుడు కాయంత,
 • ఉప్పు-తగినంత,
 • ఇంగువ-అర చెంచా,
 • పోపుని రెండు భాగాలు చేసుకోవాలి. ఒక భాగాన్ని పొడి చేసి పెట్టుకోవాలి. ఇంకో భాగాన్ని అలంకరణకి ఉపయోగించాలి.

విధానం:

ఒక బాణలిలో 4 చెంచాల నూనె పోసి వేగాక ఒక చెంచా ఆవాలు, 4 చెంచాల సెనగపప్పు,3 చెంచాల మినప్పప్పు,2 ఎండు మిరపకాయలు వేసి ఎర్రగా వేయించాలి. చివర్లో కరివేపాకు, ఇంగువ వేసి వేరే పాత్రలోకి మార్చుకోవాలి. బాణలిలో నూనె వేయకుండా మిగిలిన ఆవాలు, సెనగపప్పు, మెంతులు, ఎండు మిర్చి వేసి ఎర్రగా వేయించాలి. చల్లారిన తర్వాత తాలింపు పొడి ఇంకో భాగం, క్యాప్సికం ముక్కలు నానబెట్టిన చింతపండు మిక్సీలో వేసి చట్నీ చేయాలి. మొదట తయారు చేసిన తాలింపు కలిపితే రుచికరమైన క్యాప్సికం చట్నీ రెడీ.