అన్నమయ్య లడ్డు
  • 923 Views

అన్నమయ్య లడ్డు

కావలసినవి:

  • సెనగ పిండి- 1కే జి
  • పంచదార- 1 కే జి 300 గ్రా
  • మిశ్రీ బిళ్ళలు- 100 గ్రా
  • యాలకుల పొడి- 15 గ్రా
  • జీడిపప్పు - 100 గ్రా
  • నెయ్యి-వేయించడానికి సరిపడా
  • కిస్ మిస్- 100గ్రా

విధానం:

1) సెనగపిండిని జల్లించి-బజ్జీల పిండిలా తయారు చేసి పక్కన వుంచండి.
2) చక్కరలో మూడు గ్లాసుల నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి కలుపుతూ పాకం తయారు చేయండి.(ఒకటిన్నర తీగల పాకం ఐతే చాలు)
3) బాణలిలో నెయ్యి పోసి కాగిన తరువాత-బూంది చట్రంలో సెనగపిండిని పోస్తూ బూంది తీయండి.బూంది మెత్తగా వేయించి పాకంలో వేస్తూ వుండాలి. పైన యాలకుల పొడి వేసి కలపండి.
4 ) పాకంలో వున్న బూంది నుండి సగం తీసి కొద్దిగా గ్రైండ్ చేయండి.దీన్ని మిగిలిన బూందిలో కలిపి -జీడిపప్పు,కిస్ మిస్,మిశ్రీ బిళ్ళలుకొంచెం కలిపి లడ్డూలుగా చుడితే -ఎంతో రుచిగా వుండే అన్నమయ్య లడ్డు తయార్..