నిమ్మరసం చేప వేపుడు
 • 443 Views

నిమ్మరసం చేప వేపుడు

కావలసినవి:

 • చేపముక్కలు.. అర కేజీ
 • ఉప్పు.. ఒక టీ.
 • కారం.. 2 టీ.
 • అల్లంవెల్లుల్లి.. 3 టీ.
 • కొత్తిమీర తురుము.. పావు కప్పు
 • ఉల్లిపాయ ముక్కలు.. అర కప్పు
 • పచ్చిమిర్చి.. రెండు
 • గరంమసాలా.. ఒక టీ.
 • నిమ్మరసం.. 2 టీ.
 • నూనె.. తగినంత

విధానం:

చేపముక్కల్ని శుభ్రంగా కడిగి ఉప్పు, కారం, అల్లంవెల్లుల్లి, పట్టించి అరగంటసేపు నాననివ్వాలి. ప్రెషర్‌ పాన్‌లో నూనె వేసి చేపముక్కల్ని విడిపోకుండా రెండువైపులా వేయించి తీయాలి. తరువాత అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి ఉల్లి, పచ్చిమిర్చి ముక్కల్ని వేసి వేయించాలి. ఆపై చేప ముక్కలు కూడా వేసి కొద్దిగా మగ్గనిచ్చి గరంమసాలా చల్లాలి. చివరగా ఉప్పు సరిచూసి కొత్తిమీర తురుము చల్లి దించాలి. కాస్త ఆరిన తరువాత ఇష్టమైనవాళ్లు నిమ్మరసం చల్లి సర్వ్ చేయాలి. నిమ్మరసం చేప వేపుడు