నిమ్మ చారు
  • 527 Views

నిమ్మ చారు

కావలసినవి:

  • కంది పప్పు లేదా పెసరపప్పు - 100 గ్రా
  • నిమ్మరసం - 2 టీ స్పూన్లు
  • ఉప్పు - తగినంత
  • కరివేపాకు - 4 రెమ్మలు
  • కొత్తిమీర - కొద్దిగా
  • పచ్చిమిర్చి - 3
  • నెయ్యి - అర టేబుల్‌ స్పూన్‌
  • తాలింపు గింజలు - 1 టేబుల్‌ స్పూన్‌

విధానం:

ముందు పప్పు వండుకోవాలి. దాని పైన నీరుంటే అదంతా వంపి పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో నెయ్యి వేసి కాగనివ్వాలి. తర్వాత తాలింపు గింజలు వేసి వేగాక ఇంగువ, పచ్చిమిర్చి ముక్కలు వెయ్యాలి. స్టౌవ్‌ మీద నుండి దించిన తర్వాత ఉప్పు, నిమ్మరసం వేసి మూతపెట్టి కొంచెంసేపు అలాగే ఉంచాలి.