మిక్స్‌డ్ లీఫీ వెజిటబుల్ కర్రీ
 • 309 Views

మిక్స్‌డ్ లీఫీ వెజిటబుల్ కర్రీ

కావలసినవి:

 • మెంతికూర - 2 కట్టలు
 • గోంగూర - 2 కట్టలు
 • కొత్తిమీర - 2 కట్టలు
 • తోటకూర - 2 కట్టలు
 • చుక్కకూర - 2 కట్టలు
 • పుదీనా - ఒక కట్ట
 • నూనె - తగినంత
 • కరివేపాకు - 4 రెమ్మలు
 • పచ్చిమిర్చి - 10 (పేస్ట్ చేసుకోవాలి)
 • కొబ్బరిపొడి - 2 టీ స్పూన్లు
 • కారం - టీ స్పూను
 • ఉప్పు - తగినంత

పోపుకోసం:- ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ఇంగువ, పసుపు సరిపడి నంత.

విధానం:

ఆకుకూరలను శుభ్రంగా కడిగి తరిగి పక్కన ఉంచుకోవాలి. మందపాటి గిన్నెలో చిన్న కప్పు నూనె వేసి వేడయ్యాక ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ఇంగువ, పసుపు వరసగా వేయాలి. గోధుమరంగు వచ్చేవరకు వేయించిన తరవాత తరిగిపెట్టుకున్న ఆకుకూరలన్నిటినీ వేసి మగ్గనివ్వాలి. తరవాత అందులో ఉప్పు, కారం, పచ్చిమిర్చి పేస్ట్, కొబ్బరిపొడి వేసి బాగా కలిపి దింపేయాలి. ఇది అన్నంలోకి, చపాతీల్లోకి బావుంటుంది.