బాణలిలో ఒక కప్పు నెయ్యి పోసి అందులో మైదాపిండిని వేయించాలి. ఇంకోవైపు గిన్నెలో పంచదార వేసి తీగ పాకానికి సరిపడా నీటిని పోసి పాకం పట్టాలి. పంచదార పూర్తిగా కరిగిన తరువాత ఫుడ్ కలర్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఉడుకుతున్న మైదాపిండిలో బాదం, జీడి, కిస్మిస్లు, పంచదార పాకం వేసి గట్టిపడేదాకా తిప్పుతూ ఉండాలి. మంటను తగ్గించి పాత్రను దించేందుకు ముందుగా యాలకుల పొడి, కుంకుమపువ్వును జోడించాలి. అంతే మధురమైన వంటకం మైదా హల్వా తయార్.. ఇది వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా రుచిగా ఉంటుంది.