మలై కబాబ్
 • 320 Views

మలై కబాబ్

కావలసినవి:

 • కావలినవి.బోన్‌లెస్‌ చికెన్‌- 300 గ్రా
 • అల్లం రసం - 2 స్పూన్లు
 • ఉప్పు - తగినంత
 • క్యాప్సికం - రెండు
 • చాట్‌ మసాలా - అరటీస్పూన్‌
 • జీలకర్ర పొడి - పావుటీస్పూను
 • నిమ్మరసం - 3 టీ స్పూన్లు
 • తెల్ల మిరియాల పొడి - పావు టీస్పూను
 • టొమాటో - నాలుగు
 • కారం - పావు టీస్పూన్‌
 • వడకట్టిన పెరుగు - ఒక కప్పు

విధానం:

చికెన్‌ ముక్కల్ని కడిగి నిమ్మరసం, అల్లం, ఉప్పు వేసి కలిపి పావుగంట సేపు నానబెట్టాలి. ఒక గిన్నెలో పెరుగు, జాజికాయ, జాపత్రి, కారం, జీలకర్రపొడి, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చికెన్‌ ముక్కలకు పట్టించాలి. క్యాప్సికం, టొమాటోలను కూడా పెద్ద ముక్కలుగా కోసి చికెన్‌ ముక్కల్లో కలిపి 15 నిమిషాలు నానబెట్టాలి. ఇప్పుడు ఓ ఇనుప చువ్వకు చికెన్‌, క్యాప్సికం, టొమాటో ముక్కలు కలిపి గుచ్చి నిప్పులమీద ఓ పది నిమిషాలు కాల్చాలి. తరువాత తీసి వేడిగా పుదీనా చట్నీతో వడ్డించాలి.