మామిడి బొబ్బట్లు
  • 324 Views

మామిడి బొబ్బట్లు

కావలసినవి:

  • కావలసిన పదార్థాలు: మామిడికాయ తురుము - అరకప్పు;
  • క్యారెట్‌ తురుము - కప్పు;
  • బీట్‌రూట్‌ తురుము - పావుకప్పు;
  • పచ్చికోవా - కప్పు;
  • మైదా - మూడు కప్పులు;
  • నెయ్యి - కప్పు;
  • పంచదార - రెండు కప్పులు;
  • యాలకుల పొడి - టేబుల్‌ స్పూను;
  • ఉప్పు - చిటికెడు; నూనె - తగినంత.

విధానం:

మైదా పిండిలో ఉప్పు, మూడు చెంచాల పంచదార, పాలు చేర్చి చపాతీ పిండికన్నా కాస్త పల్చగా కలిపి గంటసేపు నానబెట్టాలి. బాణలిలో రెండుచెంచాల నెయ్యి వేడిచేసి బీట్‌రూట్‌, క్యారెట్‌ తురుములను పచ్చివాసన పోయే వరకు వేయించాలి. దాన్లో మామిడి తురుము కూడా చేర్చి మరికాసేపు వేగనివ్వాలి. పదినిమిషాలయ్యాక పంచదార, అరకప్పు నీరుచేర్చి ఉడికించాలి. బాగా ఉడికి దగ్గరపడ్డాక పచ్చికోవా, యాలకుల పొడి చేర్చి స్టౌ కట్టేయాలి. ఇప్పుడు మైదా పిండిని చిన్న ఉండల్లా చేసుకోవాలి. ఒక ఉండను తీసుకుని పాలిథీన్‌ కవరుపై నూనె అద్దుతూ చేత్తో చిన్న పూరీలా వత్తాలి. ఇందులో మామిడికాయ మిశ్రమాన్ని రెండుచెంచాలుంచి.. చుట్టూ మూసి.. మళ్లీ వత్తాలి. పెనంపై రెండుచెంచాల నూనె వేడిచేసి ఒక్కో బొబ్బట్టునూ రెండువైపులా దోరగా కాలిస్తే సరి.