మామిడికాయ చారు
  • 543 Views

మామిడికాయ చారు

కావలసినవి:

  • మామిడికాయ - 1
  • నీళ్లు - 4 కప్పులు
  • ఉప్పు - తగినంత
  • కరివేపాకు - 4 రెమ్మలు
  • పచ్చిమిర్చి - 4
  • ఉల్లిపాయ - 1
  • నూనె - 2 టీ స్పూన్లు
  • కొత్తిమీర - కొద్దిగా
  • తాలింపు గింజలు- 1 టేబుల్‌ స్పూన్‌

విధానం:

మామిడి కాయని నిప్పుల మీద లేదా స్టౌవ్‌ సెగ మీద బాగా కాల్చి చల్లారనివ్వాలి. తర్వాత తొక్క తీసి గుజ్జుని గిన్నెలో వేసుకోవాలి. ఈ గుజ్జులో నీళ్లు, ఉప్పు కలిపి పెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేసి కాగాక తాలింపు వేసుకుని పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వెయ్యాలి.అందులో ఉప్పు కలుపుకున్న మామిడికాయ గుజ్జు మిశ్రమాన్ని వేయాలి. పైన కొత్తిమీర తరుగు చల్లుకుంటే బావుంటుంది.