మామిడికాయ పప్పుచారు
  • 135 Views

మామిడికాయ పప్పుచారు

కావలసినవి:

  • మామిడికాయ - 1,
  • కందిపప్పు - కప్పు,
  • ఉల్లిపాయ - 1,
  • టొమాటో - 1,
  • పచ్చిమిర్చి - 4,
  • ఎండుమిర్చి - 3,
  • ఆవాలు, జీలకర్ర - టీ స్పూన్,
  • పసుపు- అర టీ స్పూన్,
  • వెల్లుల్లి - 5 రెబ్బలు (కచ్చాపచ్చాగా దంచాలి),
  • ధనియాలపొడి -టీ స్పూన్,
  • కరివేపాకు - 2 రెమ్మలు,
  • కారం - అర టీ స్పూన్,
  • కొత్తిమీర - టీ స్పూన్,
  • నూనె - 2 టేబుల్ స్పూన్లు,
  • ఉప్పు - తగినంత

విధానం:
 

మామిడికాయను కడిగి తగినన్ని నీళ్లు పోసి ఉడికించి, చల్లారనివ్వాలి. తగినన్ని నీళ్లు పోసి పప్పు మెత్తగా ఉడికించి పక్కన ఉంచాలి. పప్పును పలుకులుగా లేకుండా మెదపాలి. ఉల్లిపాయలు, టొమాటోలు, పచ్చిమిర్చి మరీ సన్నగా కాకుండా ముక్కలుగా కట్ చేసుకోవాలి. గిన్నెలో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, పసుపు, ఉల్లిపాయలు, కరివేపాకు, టొమాటో ముక్కలు, ఒకదాని తర్వాత ఒకటి వేసి మగ్గనివ్వాలి. ఉడికిన మామిడికాయను రసం తీసి పప్పులో పోసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న ముక్కల్లో పోసి, కారం, ఉప్పు కలిపి మరగనివ్వాలి. తర్వాత ధనియాలపొడి, కొత్తిమీర వేసి మరిగిన తర్వాత దించాలి. రుచి కోసం సాంబారుపొడి వేసుకోవచ్చు.