మ్యాంగో బర్ఫీ
  • 404 Views

మ్యాంగో బర్ఫీ

కావలసినవి:

  • మామిడిపండు గుజ్జు: 250 గ్రా
  • కోవా: 250 గ్రా
  • పంచదార (పొడి చేసుకుని): 250 గ్రా.
  • ఏలకుల పొడి: చిటికెడు
  • బాదం పప్పు
  • జీడిపప్పు
  • కిస్మిస్‌

విధానం:

మామిడి పండు గుజ్జులో రెండు టీ స్పూన్ల పంచదారను కలపాలి. పొయ్యి మీద బాణలి పెట్టి కొంచెం వేడెక్కిన తర్వాత ఈ గుజ్జు వేసి సన్నని మంట మీద అది సగం అయ్యే వరకు ఉడికించాలి. మరో బాణలి తీసుకుని సన్నని సెగపైన కోవా వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. ఉడికించిన మామిడిపండు గుజ్జు, ఏలకుల పొడి కోవాలో వేసి అన్నీ బాగా కలిసేలా కలియబెట్టాలి. ఒక పళ్ళెం తీసుకొని దానికి నెయ్యి రాసి అందులో ఈ మిశ్రమాన్ని పరచాలి. చల్లారాక ముక్కలుగా కట్‌ చేసుకొని బాదం పప్పు, జీడిపప్పు, కిస్‌మిస్‌లతో అలంకరించుకోవాలి.