మామిడిపండ్లు పై తొక్కు తీసి చిన్న ముక్కలు కోసుకోవాలి. పాలను మరిగించి అందులో క్రీం, పంచదార, ఏలకుల పొడి, మామిడి ముక్కలు కలిపి కొన్ని నిమిషాలు ఉడికించాలి. ఉడికేటప్పుడే మామిడి ముక్కలను మెత్తగా చిదమాలి. మామిడి వాసన వచ్చేవరకు స్టవ్‌మీద వుంచి దించాలి. చల్లారిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు. సర్వ్ చేసేముందు పుదీనా ఆకులను పైన చల్లుకుంటే చాలు. నోరూరించే మ్యాంగో డెజర్ట్ రెడీ.